అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Jan 29,2024 21:59

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

                        తలుపుల : వైసిపి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే పివి. సిద్ధారెడ్డి పేర్కొన్నారు. స్థానిక జీవనజ్యోతి మండల సమైక్య కార్యాలయంలో ఎంపీపీ మహమ్మద్‌ రఫీ నాయక్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలో పాటు వైసిపి సిఇసి సభ్యులు పూలశ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అందజేస్తున్న సేవల గురించి వివరించారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ ఓబులేశ్వరమ్మ మహేశ్వర్‌ రెడ్డి, తహశీల్దార్‌ శ్రీధర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిటీసీ తదితరులు పాల్గొన్నారు.

➡️