ఆశాలపై అడుగడుగునా అడ్డగింతలు

పుట్టపర్తి పట్టణంలోకి వెళ్లనీయకుండా మడకశిరలో ఆశాలను అడ్డుకుంటున్న పోలీసులు

        పుట్టపర్తి రూరల్‌: ఆశ వర్కర్లను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. 36 గంటల దీక్షల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పుట్టపర్తిలోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో ప్రత్యేక పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అందులో ప్రయాణిస్తున్న ఆశా వర్కర్లను సమావేశానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మహిళా పోలీసులు ఆశా వర్కర్ల ఆధార్‌ కార్డులు పరిశీలించి వెనుతిరిగి వెళ్లాలని సూచించారు. మరి కొంతమందిని పుట్టపర్తి రూరల్‌ స్టేషన్‌కు తరలించారు. మామిళ్లకుంట క్రాస్‌, జగరాజుపల్లి, కర్నాటక నాగేపల్లి, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆశాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసుల తీరుపై ఆశలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️