ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు ‘మంగళకర’ విద్యార్థులు

Dec 12,2023 21:43

 ప్రతిభా విద్యార్థులతో కళాశాల నిర్వాహకులు

                పుట్టపర్తి రూరల్‌ : ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు మంగళకర కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.కళాశాలలో బిబిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్న కరుణాకర్‌, తృతీయ సంవత్సరం చదువుతున్న నజీర్‌ హుస్సేన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారన్నారు. జాతీయ స్థాయిలో జరిగే వాలీబాల్‌ టోర్నమెంట్‌కు ఎంపికైన వీరు కర్నాటక రాష్ట్రంలోని బెల్గావి విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ వాలీబాల్‌ టోర్నమెంటులో ఎస్‌.కె యూనివర్సిటీ జుట్టు తరఫున ఆడనున్నారన్నారు. ఈనెల 22వ తేదీ నుండి, 25 వరకు నిర్వహించే టోర్నమెంట్లో వీరు పాల్గొననున్నారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులను మంగళకర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ సురేష్‌ కుమార్‌, ఎఒ జయచంద్ర రెడ్డి, మంగళకర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రమేష్‌ బాబు, పీడీ శ్రీనివాసులు, అధ్యాపకులు అభినందించారు.

➡️