ఎట్టకేలకు సున్నం వేశారు

Mar 22,2024 21:51

కోడూరు ఆర్‌బికెకు సున్నం వేసిన దృశ్యం

                      చిలమత్తూరు : ‘కోడ్‌ కూసిన రంగు మారలా?’ అనే శీర్షికన శుక్రవారం ప్రజాశక్తి లో ప్రచురితం అయిన కథనానికి ఎన్నికల అధికారులు స్పందించారు. మండలంలోని అన్ని ఆర్‌బికెపై ఉన్న ్న వైసిపి రంగులకు సున్నం వేయాలని ఆదేశించారు. దీంతో ఆయా సచివాలయ కార్యదర్శుళు ఆర్‌బికెలకు సున్నం వేయించారు. ఏ ప్రభుత్వ కార్యాలయంపై పార్టీ రంగులు బ్యానర్లు ఉన్నా ప్రజలు తమ దష్టికి తీసుకురావాలని ఎంపిడిఒ రాంకుమార్‌, ఇఒఆర్‌డి ఈశ్వరయ్య తెలిపారు.

➡️