కదిరిలో వైసిపికి భారీషాక్‌

Dec 13,2023 22:44

విజయవాడకు బయలు దేరిన నాయకులు

                  కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీషాక్‌ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు దాదాపు 500 మంది ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో టిడిపి కండువా వేసుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి విజయవాడకు బయలుదేరారు. ఎయిర్‌ కూలర్‌ ప్రైవేట్‌ బస్సులలో నియోజకవర్గంలోని పలువురు వైసిపి నాయకులు విజయవాడకు తరలి వెళ్లారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామాలకు వెళ్లిన రహదారులు సరిగా లేక ఇబందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివద్ధి కుంటుపడిందన్న ఉద్దేశ్యంతో వైసిపికి గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరుతున్నామని వారు వెల్లడించారు. కదిరిలో టిడిపికి పూర్వవైభం తీసుకురావటానికి కృషి చేస్తామని వారు చెప్పారు.

➡️