కరాటే పోటీల్లో హరీష్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Feb 13,2024 21:43

ప్రశంసాపత్రాలు చూపుతున్న విద్యార్థులు

                      కదిరి టౌన్‌ : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సరూర్‌ స్టేడియంలో ఆదివారం సోమవారంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కదిరి హరీష్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు మాస్టర్‌ అక్బర్‌ అలీ తెలిపారు. ఈ మేరకు వినరు, వేమంత్‌, మనోజ్‌ కుమార్‌, ఖాద్రి హితేష్‌ రెడ్డి, అసద్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారన్నారు. అలాగే అస్లాం, సమీర్‌, కార్తీక్‌, సాయి గణేష్‌, వంశీకృష్ణ యాదవ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించారని చెప్పారు. నాగచైతన్య బ్రౌన్జ్‌ మెడల్‌ సాధించాడన్నారు. అమ్మాయిల కట్టాస్‌ విభాగంలో శాలిని గోల్డ్‌ మెడల్‌ సాధించగా నాగ గీతిక సిల్వర్‌ మెడల్‌ సాధించిందన్నారు. ప్రతిభా విద్యార్థులకుకరస్పాండెంట్‌ కిరణ్‌ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని మెడల్స్‌ ని అందజేశారు. శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్‌ అక్బర్‌ అలీని విద్యార్థులను కరస్పాండెంట్‌ కిరణ్‌ అభినందించారు ఈ కార్యక్రమంలో కరాటే ఇన్స్పెక్టర్‌ రియాజ్‌, పిటి ఖాదర్‌ భాషా, ప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

➡️