కోడ్‌ కూసినా రంగు మారలా..?

Mar 21,2024 22:05

రైతుభరోసా కేంద్రానికి ఉన్న వైసిపి జెండా రంగు

                       చిలమత్తూరు : ఈ నెల 16 వ తేదీన ఎన్నికల కోడ్‌ అమలు లోకి వచ్చింది. కోడ్‌ అమలు లోకి వచ్చి 5 రోజులు అవుతున్నా స్థానిక అధికారులు మేల్కొనలేదు. ఎన్నికల నిబందనలు అమలు చేయల్సిన అధికారులు విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని కోడూరు,వీరాపురం ఆర్‌బికె కేంద్రాలతో పాటు ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న ఆర్‌బికె కేంద్రాలపై వైసిపి రంగులను అధికారులు తొలిగించనే లేదు. ఎవరూ పట్టించుకోరనుకున్నారో లేక రంగువేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నారో తెలియదు కాని అలాగే వదిలేశారు. ఇప్పటికైన స్పందించి మండల వ్యాప్తంగా ఆర్‌బికెలపై ఉన్న వైసిపి రంగులను తొలిగించి ఎన్నికల నిబందనలు అమలు చేస్తారో లేక నిబందనలు తుంగలో తొక్కుతారో వేచి చూడాలి..

➡️