గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 13,2023 22:39

పుట్టపర్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న తపాలా ఉద్యోగులు

              కదిరి అర్బన్‌ : గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తపాలా ఉద్యోగులు సమ్మె చేపట్టారు. పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన ప్లే కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు సాంబశివ, నబీరసూల్‌, రామచంద్ర, వివేక్‌ రెడ్డి, కదిరి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి క్రైమ్‌ : గ్రామీణ తపాలా ఉద్యోగ శాఖ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని రెండవ రోజు సమ్మె కొనసాగించారు. బుధవారం పట్టణంలోని తపాలా కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లా బకాష్‌, ప్రసాద్‌, మౌలాలి, భారతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నల్లచెరువు: తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారం కోసం గ్రామీణ తపాలా ఉద్యోగులు మండల కేంద్రంలోని సబ్‌ పోస్టాఫీసు వద్ద సమ్కెఉ దిగారు. మండలంలోని అన్ని బ్రాంచిల పోస్టుమాస్టర్లు తమ విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.

➡️