జగన్‌తోనే నా ప్రయాణం : ఎమ్మెల్యే

Jan 30,2024 22:20

 విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

                        మడకశిర రూరల్‌ :ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోనే చివరి వరకు తన ప్రయాణం ఉంటుందని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకు నామినేషన్‌ వేసే చివరి క్షణం వరకు టికెట్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆర్‌అండ్‌బి వసతి గహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌ కుటుంబంతో తనకు 40 సంవత్సరాలుగా అనుబంధం ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఆయన వెంటే నడుస్తానని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరుకావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కొందరు వైసిపిలో ఉంటూ టిడిపితో కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాను వైటీ ప్రభాకర్‌ రెడ్డితో అప్పు చేసిన మాట వాస్తవమేనని అయితే వడ్డీతో సహా మొత్తం చెల్లించానని చెప్పారు. కేసుల్లో ఉన్న వారు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ పార్టీని విడేది లేదన్నారు.

➡️