టిడిపిలో పలువురు చేరిక

Jan 22,2024 21:54

 పార్టీలోకి చేరిన వారితో కందికుంట

                         కదిరి టౌన్‌ :. వైసీపీకి చెందిన పలువురు నాయకులు టిడిపిలో చేరారు. సోమవారం నిజాంవలి కాలనీ కి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు పట్టణంలోని కందికుంట నివాసంలో ఆయన సమక్షంలో టిడిపిలోకి చేరారు. ముస్లిం మైనార్టీ యువత, హజ్ర సయ్యద్‌ నానా దర్గా పకీర్లు టీడీపీ లో చేరారు. అలాగే తలుపుల మండలానికి శంకర్‌, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ లో చేరారు. నిజాంవలి కాలనీలో జెండా మాను వీధికి చెందిన మైనర్టీ యువకులు సుమారు 50 మంది మెటీరియల్‌ కాంట్రాక్టర్‌ ఖాజా వలి ఆధ్వర్యంలో కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో టిడిపిలోకి చేరారు.

➡️