తాగునీటి సమస్యను పరిష్కరించండి

Mar 20,2024 22:24

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                     పెనుకొండ: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ నగర పంచాయతీ లోని వార్డులలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిప్పన్న, బాబావలి, ఫక్రుద్దీన్‌, వెంకటరాముడు, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️