దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Feb 1,2024 21:17

సమ్మె కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

                         ధర్మవరం టౌన్‌ : డ్రైవర్లను జైలుపాలు చేసే హిట్‌అండ్‌ రన్‌ చట్టాల రద్దు కోసం ఈనెల 16న దేశవ్యాప్తంగా చేపట్టే రవాణా రంగం సమ్మెను విజయవంతం చేయాలని ట్రాన్స్‌పోర్ట్‌ రÛంగం రాష్ట్ర నాయకులు రఫీ, సిఐటియు మండల కార్యదర్శి అయూబ్‌ఖాన్‌ కోరారు. సమ్మెకు సంబంధించి కరపత్రాలను స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. దేశంలోనే అసంఘటిత రంగాల్లో అతిపెద్దరంగం రవాణారంగం అన్నారు. ఈరంగం ద్వారా ఎంతోమంది ఆధారపడిజీవిస్తున్నారన్నారు. కేంద్రం గత ఏడాది డిసెంబరులో భారత న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుని రాష్ట్రపతి ఆమోదం పొంది సెక్షన్‌ 106-1 ప్రకారం ప్రమాదం చేసిన డ్రైవర్‌ అక్కడి నుండి వెళ్లే హిట్‌ అండ్‌ రన్‌ పేరుతో పది సంవత్సరాలు జైలు శిక్ష రూ.10 లక్షలు జరిమాన విధించే విధంగా దుర్మార్గమైన చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల డ్రైవర్లు ఆందోళనకు గురై సమ్మెచేపట్టనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

➡️