ధర్మవరంలో టిడిపికి పూర్వ వైభవం : పరిటాల

Dec 7,2023 21:20

 పార్టీలోకి చేరిన వారితో పరిటాల శ్రీరామ్‌, తదితరులు

                  ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మాజీ ఎంపీపీ, వాల్మీకి ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ సాకే మద్దిలేటితోపాటు పలువురు సొంతగూడు అయి టిడిపిలో చేరారు. ఓబుళనాయనిపల్లి మాజీ సర్పంచి నరసింహులు, గంటాపురం మాజీ సర్పంచి అప్పస్వామి, శ్రీనివాసులతోపాటు మొత్తం 175 కుటుంబాలు గురువారం పరిటాలశ్రీరామ్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరందరికి పరిటాలశ్రీరామ్‌ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన మాజీ ఎంపీపీ మద్దిలేటి మాట్లాడుతూ టీడీపీలో తాము ఎప్పుడో చేరాల్సి ఉందని, కానీ కొందరు నేతల దుష్ప్రచారం వల్ల ఇన్ని రోజుల సమయం పట్టిందని అన్నారు. వైసీపీని ఎదుర్కొని నిలబడే శక్తి శ్రీరామ్‌ కు మాత్రమే ఉందని నమ్మి పార్టీలోకి వచ్చామన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నాయకులతోపాటు.. పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్న నాయకుల పేర్లను కూడా రాసుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి రావాలని నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది అనుకుంటున్నారని కానీ కొందరు నాయకులు దుష్ప్రచారంతో పాటు పక్కదారి పట్టించే మాటల వల్ల ఆలస్యం అవుతోందని అన్నారు. వాస్తవంగా టీడీపీలోకి వస్తే వైసీపీ నేతలు అడ్డుకోవాలే కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కూడా అడ్డుపడుతున్నారని విమర్శించారు. వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఒక నేత పార్టీలోకి ‘రేపోస్తా,, మర్నాడు వస్తా’ అంటూ కార్యకర్తలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కొందరు నేతలు పార్టీలోకి వచ్చే వారిని రానివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ధర్మవరంలో టీడీపీనాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ నాయకులను ఏవిధంగా చూస్తున్నామో పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్న వారిని కూడా అదేవిధంగా చూడాల్సివస్తుందని అన్నారు. ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గెలిచాక ఇక్కడి ప్రజలకు స్వాతంత్య్రం పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దందాలు, భూ కబ్జాలు, సెటిల్‌ మెంట్లకు చెక్‌ పెడతామన్నారు. ప్రపంచంలోనే ఎంతో పేరు ఉన్న సిల్క్‌ సిటీకి వీరు తెచ్చిన చెడ్డపేరును తొలగిస్తాననన్నారు. ప్రతికార్యకర్త కనీసం రోజుకు గంట పనిచేస్తే తిరుగులేని మోజారిటీ తీసుకురావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీరాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజరు కుమార్‌, కమతంకాటమయ్య, నాయకులు ఫణికుమార్‌, చింతలపల్లి మహేష్‌చౌదరి, కుంటిమద్దిరంగయ్య, గొట్లూరు శ్రీనివాసులు, బోయరవిచంద్ర, కాచర్ల కంచన్న, ముత్యాలప్పనాయుడు, పోతుకుంట లక్ష్మన్న, మేకలరామాంజినేయులు, పురుషోత్తంగౌడ్‌, నాగూర్‌ హుస్సేన్‌, రాళ్లపల్లి షరీఫ్‌, రవూఫ్‌, కొత్తపేట ఆది, చట్టా లక్ష్మీనారాయణ, రమేష్‌బాబు, గుత్తాసూరి, బొట్టుకిష్ట, భీమనేని ప్రసాద్‌నాయుడు, చిగిచెర్ల రాఘవరెడ్డి, బీబీ, స్వర్ణకుమారి, బాను, చీమల రామాంజి, చీమలసూరి, తలారిచంద్రమోహన్‌ బాబు, మాధవరెడ్డి, కేశగాళ్లశీన, మహేశ్‌ పాల్గొన్నారు.

➡️