ధర్మవరం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో : పరిటాల

Jan 3,2024 22:24

మినీ మేనిఫెస్టో కరపత్రాలను చూపుతున్న పరిటాల శ్రీరామ్‌, తదితరులు

                  ధర్మవరం టౌన్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పూర్తితో ధర్మవరం పట్టణం కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో ఐదు రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శివానగర్లోని శివాలయంలో బుధవారం ప్రతేక పూజల అనంతరం 7వ వార్డులో పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ప్రతి కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తామన్నారు. ఈ పాదయాత్ర 8వతేదీవరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శులు గోనుగుంట్లవిజరుకుమార్‌, కమతం కాటమయ్య, పణికుమార్‌, పల్లపు రవీంద్ర, పల్లపు శివశంకర్‌, పురుషోత్తంగౌడ్‌, పరిశేసుధాకర్‌, నాగూర్‌ హుస్సేన్‌, రాళ్లపల్లిషరీఫ్‌, అత్తర్‌ రహీంబాషా, గోసలశ్రీరాములు, బొట్టుకిష్ట, మహేశ్‌, ఇర్షాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️