‘నా సేన కోసం నావంతు’ను విజయవంతం చేయండి

Feb 20,2024 21:34

సమావేశంలో మాట్లాడుతున్న చిలకం మధుసూదన్‌రెడ్డి

                         ధర్మవరం టౌన్‌: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నా సేనా కోసం నావంతు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ధర్మవరం పట్టణ, రూరల్‌, బత్తలపల్లి మండలాలకు సంబంధించిన బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నా సేన కోసం నావంతు లో భాగంగా ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ కోసం తన వంతుగా రూ.1లక్ష పార్టీకి విరాళం అందించామని చిలకం తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం రూ.3.05 లక్షలు అందజేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు చిలకం మధుసూదన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

➡️