పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం

Mar 1,2024 21:32

పరీక్ష సామగ్రి అందజేస్తున్న పాంచజన్య శ్రీనివాసులు

                    హిందూపురం : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య ఛేదన కోసం క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే విజయం వారి వెంటే ఉంటుందని హిందూపురం జోన్‌ ప్రైవేట్‌ స్కూల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు సూచించారు. మార్చి 18 నుంచి పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హిందూపురం జోన్‌ ప్రైవేట్‌ స్కూల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో హిందూపురం జోన్‌ వ్యాప్తంగా ఉన్నా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన విద్యా సామాగ్రినిశుక్రవారం పట్టణంలోని చిన్మయ పాఠశాలలో అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఏ కళాశాలకు వెళ్లిన గతంలో చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆయా కళాశాలల్లో మెలగాలని అన్నారు. విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ మంచి మార్కులు సాధించి పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వేణు గోపాల్‌, ట్రెజరర్‌ రియాజ్‌, చిన్మయ పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు సరళ, మహేష్‌, చంద్ర, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️