‘పది’ పరీక్షల పరిశీలన

పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         కొత్తచెరువు : స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను శనివారం జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగ కుండా, ఇబ్బందులు లేకుండా పరీక్షలను ప్రశాంతం గా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 115 కేంద్రాల్లో 25,779 మందికి 24,456 మంది విద్యార్థులు ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షకు హాజరు కాగా 1,323 మంది గైర్హాజరయ్యారని వృత్తి విద్య జిల్లా కోఆర్డినేటర్‌ లాజర్‌, తెలిపారు. కలెక్టర్‌ వెంట డిఇఒ మీనాక్షి, ఆర్డిఓ భాగ్యరేఖ, తహశీల్దార్‌ కళావతి ఉన్నారు.

➡️