ప్రతిభా విద్యార్థులకు అభినందన

Feb 27,2024 22:02

విద్యార్థులను అభినందిస్తున్న పాంచజన్య శ్రీనివాసులు

                         హిందూపురం : ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అబియాన్స్‌ ఇండియా (ఎన్‌ఐఎస్‌ఎ) జాతీయ స్థాయిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్‌ఎఎటి -2023 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాంచజన్య పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థి ముస్తఫా జాతీయస్థాయిలో ప్రధను ర్యాంకు, ద్వితీయ ర్యాంకు రిధా ఫాతిమాలు సాధించారు. వీరు గత బుధవారం డిల్లీలోని హయాత్‌ హెరీటల్‌ లో పద్మశ్రీ డాక్టర్‌ జిలేందర్‌ సింగ్‌, ఎన్‌ఐఎస్‌ఎ అధ్యక్షులు కుల భూషణ్‌ శర్మ చేతుల మీదుగా బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు మంగళవారం ప్రథమ, ద్వితీయ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు అభినందించారు. త్వరలో ముస్తఫా లండన్‌ లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ప్రథమ బహుమతిని అందుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ నందకుమార్‌, హెచ్‌ఎం గాయత్రి, ఎఒ భాస్కర్‌, సూపరింటెండెంట్‌ విజయేంద్ర, ఎహెచ్‌ఎం సతీష్‌ కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️