బాధితులకు కౌన్సిలర్‌ ఆర్థికసాయం

Dec 14,2023 22:40

 ఆర్థికసాయం అందజేస్తున్న కౌన్సిలర్‌, తదితరులు

                  ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని రాంనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు చింత రమణదాస్‌ కుమారుడు ధర్మతేజ ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న 39 వ వార్డు కౌన్సిలర్‌ కడప రంగస్వామి, అతనిసోదరుడు కడప ఈశ్వర్‌ రంగా వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి ధర్మతేజ చికిత్స కోసం విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్‌ రంగస్వామి తన వంతుగా పదివేల రూపాయలు జమ చేశాడు. మొత్తం 60 వేల రూపాయలను బాధితులకు అందజేశారు.

➡️