బాధిత రైతుకు ఆర్థిక సాయం

Jan 16,2024 22:07

బాధితుడికి ఆర్థికసాయం అందజేస్తున్న సామకోటి       

              పుట్టపర్తి రూరల్‌ : ప్రమాదవశాత్తు పశుగ్రాసం కాలిపోయి నష్టపోయిన బాధిత రైతుకు పుట్టపర్తి సామకోటి ఆదినారాయణ ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. పుట్టపర్తి మండల పరిధిలోని వెంగళమ్మ చెరువు గ్రామంలో రైతు సూర్యనారాయణకు చెందిన గడ్డివామికి సంక్రాంతి రోజు రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కాలిపోయింది. విషయాన్ని తెలుసుకున్న సామకోటి ఆదినారాయణ బాధిత రైతును పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ అగ్నిప్రమాదంతో బాధిత రైతులుకు దాదాపు 30వేల రూపాయలు నష్టం జరిగిందన్నారు. పాడియావులతో జీవనం చేసుకుంటున్న బాధితుడి పశుగ్రాసం కాలిపోవడంతో జీవనోపాధి కోల్పోతాడన్నారు. పశుగ్రాసం కొనుగోలుకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, సత్యనారాయణ, వెంకటేష్‌, నరసింహుడు, కిష్టప్ప, కేశవ, రామచంద్ర, రామన్న, శ్రీరామయ్య, రామాంజి, కల్లూరు గంగప్ప, మటన్‌ వెంకట్రాముడు, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️