బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే దేశం అథోగతి

Jan 30,2024 22:17

 సమావేశంలో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి

                     మడకశిర : కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతోందని సిడబ్ల్యూసి మెంబర్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని నీలకంఠ కోల్డ్‌ స్టోరేజ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాన్ని మండల కన్వీనర్‌ మంజునాథ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రూ. 47 లక్షల కోట్లు అప్పు చేస్తే పదేళ్ల బిజెపి పాలనలో రూ. 116 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఏం అభివృద్ధి చేశారని ఇంత అప్పు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇతరులతో పిసిసి అధ్యక్షురాలు షర్మిలను తిట్టించడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన మడకశిరలో నిర్వహించే బహిరంగసభకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటుందన్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భారీగా తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మడకశిర కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సుధాకర్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్లు ప్రభాకర్‌ రెడ్డి, నరసింహమూర్తి, కన్వీనర్లు బాబు, గౌడప్ప, లోకేష్‌, గురుమూర్తి, నాగరాజు, బి బ్లాక్‌ అధ్యక్షులు త్యాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బయపరెడ్డి, రాజు, సర్పంచులు శంకర్‌ రెడ్డి, డాక్టర్‌ రవి శంకర్‌, మాజీ కో ఆప్షన్‌ మెంబర్‌ మల్లికార్జున, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రంగారెడ్డి, దొడ్డయ్య నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు.

➡️