మట్టి మాఫియాపై చర్యలకు డిమాండ్‌

Jan 29,2024 22:00

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు

                     హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలం చౌళూరు పంచాయతీ పరిధిలోని కారుడిపల్లి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలను ఏర్పాటు చేసి మట్టిని తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కారుడిపల్లి గ్రామస్తులు అధికారులను కోరారు. మండలంలో అను మతులు లేకుండా అక్రమ మట్టి రవాణాపై ప్రజాశక్తిలో ‘పేట్రేగిన మట్టి మాఫియా’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ఈ కథనానికి గ్రామస్తులు స్పందించారు. సోమవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి తహశీల్దార్‌ స్వర్ణలతకు, ఇరిగేషన్‌ కార్యలయం ముందు ఆందోళన చేసి డిఈఈలకు వినతిపత్రాలు అందజేశారు. అక్రమ మట్టి రవాణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మట్టితరలింపును అడ్డుకున్న గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, అక్రమంగా మట్టిని తరలించిన రామకృష్ణపై కేసు నమోదు చేసి యంత్రాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మంజూనాథ్‌ గౌడ్‌, అంజి, గోపీనాథ్‌ రెడ్డి, శివయ్య, నరసింహమూర్తి, చందు, మారుతి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️