రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకే మద్దతు

Feb 16,2024 22:08

ర్యాలీలో పాల్గొన్న నాయకులు, తదితరులు

                       కదిరి టౌన్‌ : రాజకీయ పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు వెళదామని వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకు మద్దతు ఇద్దామని బలిజ సంఘం నాయకులు మంచి శివశంకర్‌ బైరవ ప్రసాద్‌ గవ్వల శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీకష్ణ దేవరాయులు జయంతి పురస్కరించుకొని నియోజకవర్గం వ్యాప్తంగా బలిజలు దాదాపు 2 వేల మంది శుక్రవారం పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కోనేరు వద్ద గల శ్రీకష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోడ్లు భవనాలు అతిధిగృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కులస్తులలో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు సహకరించుకుందామన్నారు. రాష్ట్రంలో 27శాతం జనాభా కల్గిన బలిజలకు ఏపార్టీ తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. బలిజలు పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా వారిని గెలిపించుకోవాలని సూచించారు. రాజ్యాధికారం కేవలం ఒకటి రెండు వర్గాలకు కాకుండా రాష్ట్రంలోని అన్ని కులాలకు వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలోబైక్‌ ర్యాలీ నిర్వహణ కమిటీ సభ్యులచ, శ్రీ కష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం అధ్యక్ష ప్రధానకార్యదర్శులు చింతకుంట రమేష్‌ బాబు, దఢం శ్రీనివాసులు, పోగునూరు ఆది, కదిరి పట్టణ బలిజ సేవా సంఘం అధ్యక్షులు కూనక పుల్లయ్య, అఖిల భారత కాపు సమాఖ్య జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, కదిరి నియోజకవర్గ కాపు రాజకీయ జెఎసి అధ్యక్షులు పసుపులేటి సురేష్‌ కుమార్‌, కాపునాడు నాయకులు కొండా మల్లిఖార్జున, బలిజ కాపునాడు జిల్లా అధ్యక్షులు నాదేండ్ల వెంకట ప్రసాద్‌, ఆర్‌పిఎఫ్‌ నాయకులు యర్రంశెట్టి రమేష్‌, కుటాల లక్ష్మణ, బలిజ యువజన సంఘం అధ్యక్షులు గరడాల రమణ, బలిజసేన నాయకులు అన్నం జనార్ధన, మల్లెం రాము, కంచం నాగేంద్ర ప్రసాద్‌, చిన్న, వెలగ నాగరాజు, ఎద్దుల రాముడు, బాగేపల్లి అశోక్‌, సత్యనారాయణ, మల్లిఖార్జున జితేంద్ర, రమేష్‌, భైరిశెట్టి, శీను తదితరులు పాల్గొన్నారు.

➡️