రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీ : టిడిపి

Feb 8,2024 21:35

సమావేశంలో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి

                 మడకశిర : రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీ అని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. రూ.13వేల కోట్ల రెవెన్యూ లోటును రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ.60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదే అని అన్నారు. పన్నుల బాదుడే తప్ప బడ్జెట్‌ లో కొత్త అంశాలు ఏవీ లేవన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎపి అప్పులు రెట్టింపు అయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గం పరిశీలకులు పులివెందుల పార్థసారథి రెడ్డి , పట్టణ అధ్యక్షులు మనోహర్‌, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు భక్తర్‌, జిల్లా కార్యదర్శి అమరాపురం మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ : బుగ్గన బడ్జెట్‌ అంతా అంకెల గారడీనే అని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి గురువారం విమర్శించారు. పేర్కొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బుగ్గన బడ్జెట్‌ అంచనాలు కొండంత.. ఖర్చులు పిసరంత అని తెలిపారు.రూ.13వేల కోట్ల రెవెన్యూ లోటును.. రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ.60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదే అన్నారు.పన్నుల బాదుడు తప్ప బడ్జెట్‌ లో కొత్త అంశాలు ఏమీ లేవని అన్నారు. ధర్మవరం టౌన్‌ : ఏపీ బడ్జెట్‌ చూస్తే అంకెల్లో సంక్షేమం ఊహల్లో అభివృద్ధి కనిపిస్తోందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరిటాలశ్రీరామ్‌ వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన అనంతపురంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఉందన్నారు. అప్పులుచేసి డబ్బు పంచితే అది పేదరిక నిర్మూలన అవుతుందా అని ప్రశ్నించారు. అబివృద్ధి గురించి చెబుతున్న జగన్‌ సర్కార్‌ రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్ధితిలో ఉందన్నారు. ఓటాన్‌ అకౌండ్‌ బడ్జెట్లో అసలు జిల్లాకు ఎంత కేటాయించారన్నది స్పష్టత రాలేదన్నారు. హాంద్రీనీవాతో పాటు హెచ్‌ఎల్సీ కాలువల గురించి ప్రస్తావనే లేదన్నారు. మరోవైపు రైతులకు స్వాంతన కల్గించేలా ఈ బడ్జెట్లో ఒక అంశం కూడా లేదన్నారు. ఉమ్మడి అనంత కరువు కోరల్లో ఉంటే సాయం చేస్తామన్న ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. సంక్షేమం పథకాల గురించి తప్ప అభివృద్ధి గురించి బడ్జెట్లో ఏమీలేదన్నారు. డిస్కమ్‌ బకాయిలు రూ.27,284 కోట్లుగా చెప్పిన సర్కార్‌ సామాన్యులపై విద్యుత్‌ రూపంలో ఇప్పటికే వేల కోట్లు రుపాయల భారం మోపిందన్నారు. సగటు వ్యక్తి విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మోయలేకపోతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ తమ మానస పుత్రిక అని చెప్పుకునే ప్రభుత్వం ఈ పథకం కింద ఉన్న బకాయిల సంగతేంటో చెప్పలేదన్నారు. ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతూ మరోసారి మోసానికి శ్రీకారంచుట్టారన్నారు.అయితే ప్రజలు ఈ బడ్జెట్‌తో పాటు ప్రభుత్వాన్ని నమ్మలేదన్నారు. వైసిపికి ఇదే చివరి బడ్జెట్‌ అవుతుందని జోస్యం చెప్పారు. కదిరి, టౌన్‌ : రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలు కొండంత.. ఖర్చులు గోరంతలా ఉందని టిడిపి కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ ఎద్దేవా చేశారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్‌ లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. విద్యుత్‌ ఛార్జీల వడ్డన లో వైసీపీ సర్కార్‌ ముందు నిలిచిందన్నారు.

➡️