రైతుల కష్టాలు తీర్చడమే లక్ష్యం : ఎమ్మెల్యే

Jan 22,2024 21:50

పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే, తదితరులు

                        ఓబుళదేవరచెరువు : వర్షాలు లేక వేరుశెనగ వంట కోల్పోయి రైతులు పడుతున్న కష్టాలు చూడలేక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 192 చెరువులు నింపాలనేదే తమ లక్ష్యంగా చేసుకున్నామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ఆలోచనను పథకాన్ని తామే సృష్టించామని వీటిని కార్యరూపం దాల్చుతామని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి పల్లె రఘునాథ్‌ రెడ్డి, ఆ పార్టీ ఇతర నాయకులు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్రలో భాగంగా నాలుగోరోజు ఓడి చెరువు మండలం. మహమ్మదాబాద్‌ క్రాస్‌, సున్నంపల్లి ,రామయ్య పేట, చౌడంపల్లి రోడ్‌ ,దాదిరెడ్డిపల్లి రోడ్డు, గౌరాపురం మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ఓట్లు అడిగేందుకు టిడిపి నాయకులు మళ్లీ బయలుదేరారన్నారు. ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు పనిచేసిన పల్లె రఘునాథ్‌ రెడ్డి ప్రజలకు మేలు చేసింది శూన్యం అని విమర్శించారు. టిడిపి నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తే ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ రాజు నాయుడు, ఎంపీపీ పర్వీన్‌ భాను, టౌన్‌ కన్వీనర్‌ కోళ్ల కృష్ణారెడ్డి, నాయకులు తుమ్మల షామీర్‌బాషా, లక్ష్మిరెడ్డి, జవులి బాబా, మల్లూరి కృష్ణారెడ్డి , సలీంబాషా తదితరులు పాల్గొన్నారు.

➡️