వాహనం ఢకొీని చిరుతకు గాయాలు

Feb 6,2024 21:41

గాయపడిన చిరుతను తరలిస్తున్న అధికారులు, సిబ్బంది

                   పెనుకొండ : పట్టణ సమీపంలోని ఆర్‌టిఒ చెక్‌ పోస్ట్‌ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం గుర్తుతెలియని వాహనం చిరుతను ఢ కొంది.ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయ పడింది. మంగళవారం రవాణా తనిఖీ కేంద్రం సమీపంలో అటవీ ప్రాంతం నుండి జాతీయ రహదారి దాటుతున్న చిరుతను గుర్తుతెలియని వాహనం ఢకొీనడంతో గాయపడిన చిరుతకు పశు వైద్యులు వైద్య చికిత్సలు చేశారు. తిరుపతి జూ పార్కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తామని అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి క్రైమ్‌ : పెనుకొండ ఆర్డీవో చెక్‌ పోస్ట్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢకొీని గాయపడిన చిరుతను పుట్టపర్తి మున్సిపాలిటీ లోని ఎనుములపల్లి లో ఉన్న కరుణ సొసైటీకి అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో తరలించారు. కరుణ సొసైటి సంస్థ సభ్యులు గాయపడిన చిరుతకు ప్రథమ చికిత్స అందించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చిరుతకు గొంతు దగ్గర తీవ్రంగా గాయమైనట్లు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు.

➡️