విషాదం..!

Feb 6,2024 21:29

మృతి చెందిన కానిస్టేబుల్‌ గణేష్‌ (ఫైల్‌ ఫొటో)

       ధర్మవరం టౌన్‌ : ఆయనకు పోలీసు ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం… కుటుంబం కంటే ఎక్కువగా తన విధులకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఎక్కడా కూడా చిన్నపాటి చెడ్డపేరు లేకుండా జీవితాన్ని గడిపారు. నిజాయితీతో పోలీసు విధులను నిర్వర్తించాడు. వృత్తి ధర్మానికి ప్రాధాన్యతను ఇస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఎర్రచందనం స్మగ్లర్లు పొట్టనబెట్టుకున్నారు. స్మగ్లర్ల ఆటకట్టించేందుకు వెళ్లిన ఆ పోలీసు కానిస్టేబుల్‌ వారి బరితెంగిపుతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం చీనెపల్లె వద్ద మంగళవారం వేకువజామున ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్‌ గణేష్‌ ధర్మవరం పట్టణం పోతుకుంట గ్రామస్తుడు. ఈయన మృతి విషయం తెలియడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

గుట్టకిందపల్లికి చెందిన ఎపిఎస్‌పి 14వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ బి.గణేష్‌(40) 2013లో పోలీసు విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఈయన అన్నమయ్య జిల్లా కెవి.పల్లి మండలంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కంభంవారిపల్లె మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 3గంటల సమయంలో సుండుపల్లె సరిహద్దు గొల్లపల్లె వద్ద పోలీసు సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనం రాగానే కానిస్టేబుల్‌ గణేష్‌తో పాటు సిబ్బంది దానిని ఆపేందుకు యత్నించారు. స్మగ్లర్లు కారు ఆపకుండా వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనాన్ని ఆపుదామని ప్రయత్నించిన గణేష్‌ను ఢకొీట్టారు. కారుతో వేగంగా ఢకొీట్టడంతో గణేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

మంచి వ్యక్తిగా గుర్తింపు..

         స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్‌ గణేష్‌కు గుట్టకిందపల్లి గ్రామంలో మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. బిల్లే శ్రీరామలు, అలివేళమ్మ దంపతులకు ఏకైక కుమారుడు. గణేశ్‌ కష్టపడి 2013లో పోలీసు ఉద్యోగం సాదించాడు. 6 ఏళ్ల క్రితం తండ్రి మతిచెందాడు. అప్పటి నుంచి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ అన్నీ చూసుకునేవారు. 9ఏళ్ల క్రితం రామగిరి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన అనూషను వివాహం చేసుకున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు రాజకిశోర్‌, వేదాంత్‌లు ఉన్నారు. గ్రామంలో అందరినీ ఆప్యాయుతగా పలుకరిస్తూ, మంచి వ్యక్తిగా ఉన్న గణేశ్‌ స్మగర్ల చేతిలో మతిచెందడంతో గుట్టకిందపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

నేడు అంత్యక్రియలు

        స్మగర్లచేతిలో మతిచెందిన గణేశ్‌ మతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. ఆయన మృతదేహం మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకుంది. బుధవారం ఉదయం ధర్మవరం పట్టణం గుట్టకిందపల్లి వద్ద పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

➡️