వైట్‌ ఫీల్డ్‌ లో నర్సింగ్‌ కాలేజీ ప్రారంభం

Jan 19,2024 21:35

 కర్నాటక ఉపముఖ్యమంత్రికి సత్యసాయి చిత్రపటాన్ని అందజేస్తున్న ట్రస్టు సభ్యులు 

                       పుట్టపర్తి క్రైమ్‌ : బెంగళూరులోనీ శ్రీ సత్య సాయి ఇన్యుస్ట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలో నర్సింగ్‌ కళాశాల భవనాన్ని కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. సత్య సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నర్సింగ్‌ విద్యార్థుల కోసం 6 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించామని ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్‌ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల క్రితం తను ఒక బహిరంగ కార్యక్రమంలో సత్య సాయి బాబాను మొదటిగా దర్శించానని చెప్పారు. సేవా సంస్థలకు తన మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కే చక్రవర్తి, మేనేజింగ్‌ ట్రస్ట్‌ ఆర్‌ జె రత్నాకర్‌, ఎస్‌ఎస్‌ నాగానంద్‌, మనోహర్‌శెట్టి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుందరి కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️