వైసిపిలో పలువురు చేరిక

Jan 22,2024 21:52

పార్టీలోకి చేరిన వారితో మంత్రి ఉషశ్రీచరణ్‌, తదితరులు

                      పరిగి : ఇటీవలే పెనుగొండ నియోజకవర్గం వైసిపి సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్‌ ఆత్మీయ పలకరింపు పేరుతో చేస్తున్న పర్యటనకు విశేష స్పందన లభిస్తోంది. సోమవారం పరిగి మండలంలోని ఊటుకూరు పంచాయతీ నుండి ప్రారంభమైన కార్యక్రమం వనంపల్లి పంచాయతీ జంగాలపల్లి లో ముగిసింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు స్వాగతం పలికారు. ఎర్రగుంట పంచాయతీలో సర్పంచ్‌ బాలకృష్ణ నరేష్‌ ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు వైసీపీలో చేరారు. వీరికి మంత్రి ఉష శ్రీ చరణ్‌ పార్టీ కండూవాలు కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పైడేటి ప్రభాకర్‌, జెడ్పీటీసీ శ్రీరాములు, సర్పంచులు మంజునాథ్‌ రెడ్డి, దిలీప్‌ కుమార్‌, ఎంపీటీసీలు అరుంధతి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️