వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం : పల్లె

Jan 23,2024 22:10

జయహో బిసి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తదితరులు

                    నల్లమాడ :రాబోయే ఎన్నికల్లో బిసి వర్గాలు వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జయహో బిసి సభలో పల్లె మాట్లాడారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు కృషితో బిసిలకు దక్కిన అనేక చట్టాలు, రిజర్వేషన్లను సిఎం జగన్‌ తగ్గించి బిసిల ద్రోహిగా మారాడన్నారు. ఎన్నికల కోసమే వైసిపి ఎమ్మెల్యే బూటకపు పాదయాత్ర చేపట్టారన్నారు. సొంత పార్టీ నాయకులతోనూ ఎమ్మెల్యే భూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సిఎం జగన్‌ బిసిలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుండుపడిందన్నారు. బిసిలు ఏకతాటిపైకి వచ్చి టిడిపికి మద్దతుగా నిలవాలని కోరారు. జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ టిడిపి, జనసేన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సదస్సులో మండల కన్వీనర్‌ శివశంకర్‌, నాయకులు బోయ రామాంజనేయులు, సామకోటి ఆదినారాయణ, పల్లపు రవీంద్ర, పార్థసారథిరెడ్డి, అరుణ్‌కుమార్‌, అంజనప్ప, వలిపి సోమశేఖర్‌, శ్రీనివాసరెడ్డి, శ్యామ్‌బాబు, కృష్ణారెడ్డి, వలిపి శ్రీనివాసులు, జయచంద్ర, సుధాకర్‌, జాకీర్‌, బ్రహ్మానందరెడ్డి, సలాంఖాన్‌, మంజునాథరెడ్డి, అబ్బాస్‌ఖాన్‌, బాబావలి, రమణ, డాక్టర్‌ నాగభూషణ్‌, బొమ్మయ్య, శ్రీరామ్‌రెడ్డి, పుల్లప్ప, పరిమళ, వెంకటలక్ష్మి, నళిని పాల్గొన్నారు.

➡️