వైసిపి సేవలో వాలెంటీర్లు

Mar 21,2024 22:04

ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్న సమావేశంలో పాల్గొన్న వాలెంటీర్‌ (వృత్తంలో ఉన్న వ్యక్తి)

                    కదిరి టౌన్‌ ఎన్నికల నిబంధనలను కదిరి పరిధిలోని వాలెంటీర్లు అతిక్రమిస్తున్నారు. వైసిపి నాయకుల సేవలో వారు మునిగితేలుతున్నారు. గురువారం కదిరి రూరల్‌ మండలం ఎర్రదొడ్డి పంచాయతీలో వైసిపి కార్యకర్తల ఆత్మీయసమావేశం ఏర్పాటు చేశారు . ఈ సమావేశానికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆ గ్రామ వాలంటీర్లు గౌతమ్‌ నాయక్‌, సోమశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

➡️