వైసిపి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి

Dec 19,2023 22:02

సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరిస్తున్న నాయకులు

                    ధర్మవరం టౌన్‌ : వైసిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో ధర్మవరం నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందిందని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాచర్ల లక్ష్మీ తెలిపారు. పట్టణంలోని 24వ వార్డులో పార్థసారథి నగర్‌-1 సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన పల్లెకు పోదాం అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె వైస్‌ చైర్మన్లతో పాటు వార్డు కౌన్సిలర్లతో కలసి రూ.23.64 కోట్లకు సంబంధించిన సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గోరకాటి పురుషోత్తం రెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ చందమూరి నారాయణరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాలిరెడ్డి, కౌన్సిలర్‌ మేడాపురం వెంకటేష్‌, వార్డు ఇన్‌ఛార్జులు రాయపాటి రామకృష్ణ, చాంద్‌బాషా, చెలిమి పెద్దన్న, కత్తే పెద్దన్న, సుభాన్‌బాషా, పెద్దిరెడ్డి, జింక కంబగిరి, కుమారస్వామి, రాయపాటి రామకృష్ణ, చెలిమి పెద్దన్న, సచివాలయ, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️