సెర్ఫ్‌ ఉద్యోగుల వినూత్న నిరసన

Jan 30,2024 22:13

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

                 పుట్టపర్తి రూరల్‌ : డిఆర్‌డిఎ, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం డిఆర్‌డిఎ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరసన మంగళవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆనిమేటర్లు, మండల సమాఖ్య అకౌంట్‌ సెక్షన్‌ లో పని చేసే ఉద్యోగులు, వీరికి మద్దతు తెలుపుతూ శిబిరంలో బైటాయించారు. మంగళవారం రోజున నిరవధిక నిరాహార దీక్షలో రాధమ్మ, లక్ష్మీనారాయణ, శ్రీరాం నాయక్‌, అంజినప్ప, కిష్టప్ప కూర్చున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. .ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రామేశ్వర్‌ రెడ్డి, గోపాల్‌, రామమోహన్‌, రమణప్ప, శంకర్‌, సుధాకర్‌, ఆనిమేటర్లు, గోరంట్ల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

➡️