స్పందనకు అధికారులు కరువు

Jan 29,2024 21:58

స్పందనకు హాజరైన అధికారులు

                   గాండ్లపెంట : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి అధికారులు కరువయ్యారు. కేవలం ఐదు శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. తహశీల్దార్‌, ఇఒఆర్‌డి, సెరికల్చర్‌, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌, ఎపిఒ మినహా మిగతా శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించే స్పందన కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావటాన్ని బట్టి చూస్తే వీరికి ప్రజాసమస్యల పరిష్కారంపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహశీల్దార్‌ హమీద్‌బాషా మాట్లాడుతూ మండలంలో 27 శాఖలు ఉండగా ఐదు శాఖల అధికారులు హాజరయ్యారని చెప్పారు. మిగిలిన 22 శాఖల అధికారులు గైర్హాజరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

➡️