స్పందన విజ్ఞప్తులకు తక్షణ పరిష్కారం

Feb 12,2024 22:42

అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ

                   పుట్టపర్తి అర్బన్‌ : స్పందనలో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో 280 అర్జీలను జాయింట్‌ కలెక్టర్‌ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, టిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారులు సంతప్తి చెందే విధంగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️