హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Feb 18,2024 21:30

ఎంపికైన మహిళ, పురుష హ్యాండ్‌ బాల్‌ జట్ల క్రీడాకారులు

                       హిందూపురం : లేపాక్షి మండలం నవోదయ పాఠశాల ఆవరణంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో 9వ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల పోటీలకు అనంతపురం ఉమ్మడి జిల్లా హ్యాడ్‌ బాల్‌ మహిళా, పురుషుల జట్లను ఎంపిక చేశారు. ప్రిన్సిపల్‌ నాగరాజు, వివేకానంద, సందీప్‌, వేదవతి, యాసిన్‌ మాలిక్‌, అర్షియ భాను తదితరులు క్రీడాకారుల ఆటను పరిశీలించి జట్లను ఎంపిక చేశారు. మహిళా జట్టులో కుమారి జ్యోతిక, కే లలిత, శ్రీ నిఖిత, దివ్య, నాగ, హర్షిత, జాహ్నవి, వర్షిత, హేమలత, శ్రీ రేణుక రెడ్డి, సాయి కీర్తి, నిఖిత, ఎం చెర్రీ, జాస్మిన్‌, చందన, ప్రశాంతి లక్ష్మి, సూచితా రెడ్డి, వెన్నెల, లిఖితను ఎంపిక చేశారు. జట్టుకు మేనేజర్‌ అండ్‌ కోచ్‌ గా నవోదయ పాఠశాల పీడీ వేదవతిని నియమించారు. అలాగే పురుషుల జట్టులో సందీప్‌ కుమార్‌, బి జీవన్‌ రెడ్డి, యాగ్ని ఈశ్వర్‌, ఏ అమన్‌, జస్వంత్‌, వంశీ, యశ్వంత్‌, నరేష్‌ కుమార్‌, భరత్‌, శ్రీ సాయినాథ్‌, మనోజ్‌ కుమార్‌, శివరాజ్‌, సందీప్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. ఎంపికైన రెండు జట్లు ఈ నెల 23, 24 తేదీల్లో నంద్యాలలోని శ్రీ రామలింగా రెడ్డి డిగ్రీ కళాశాలలో జరిగే 9వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఎంపికైన జిల్లా జట్ల సభ్యులకు జిల్లా హ్యాండ్‌ బాల్‌ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎం బలరాం రెడ్డి, ముస్తఫా కమల్‌బాసా అభినందించారు.

➡️