అప్పుల బాధ తాకలేక రైతు ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న రామాంజినేయులు (ఫైల్‌ఫొటో)

          కొత్తచెరువు : అప్పులబాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… లోచర్ల గ్రామానికి చెందిన రైతు మునిమడుగు రామాంజనేయులు(57) తనకున్న ఎకరా పొలంతోపాటు గ్రామంలో మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని బోరు బావుల కింద పంట సాగు చేస్తున్నాడు. వేరుశనగతో పాటు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేసేవారు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మానసిక వేదనతో శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం తలుపులు తెరిచి చూడగా ఉరికి వేలాడుతూ రామాంజినేయులు కన్పించడు. ఘటనా స్థలాన్ని సిఐ రాజా రమేష్‌ పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

➡️