తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ

Dec 13,2023 13:23 #Sri Satya Sai District
anganwadi protest 2nd day satyasai

ప్రజాశక్తి-బత్తలపల్లి(శ్రీ సత్యసాయి జిల్లా) : అంగన్వాడి వర్కర్లు చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు బత్తలపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముద్దుగుబ్బ తాడిమర్రి బత్తలపల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు ఆయాలు మినీ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని గ్రావిటీ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరిన్ని రోజులు ధర్నాలు చేపడతామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు దిల్షాదు బత్తలపల్లి ప్రాజెక్టు యూనియన్ నాయకురాలు వాసంతి, రజియా, భారతి, వసంత, రజిత, పుష్పాలత, శివమ్మ, శ్రీదేవి, ఆదెమ్మ, సుగుణ, అంగీవాడి వర్క్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.

➡️