అవ్వమెచ్చిన రాజధాని

Jul 1,2024 22:06

పింఛను మొత్తాన్ని మంత్రికి అందజేస్తున్న వృద్ధురాలు నారాయణమ్మ

                    ధర్మవరం టౌన్‌ : నాకు చదువు సంధ్యలు లేవు. మా ఇంటిలో పిల్లోళ్లు రాజధాని గురించి మాట్లాడుకుంటుంటే అమాయకంగా వింటుండేదాన్ని. అట్ల వినగా రాజధానిలోని రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందనేది తెలుసుకున్నాను. రాష్ట్రానికి రాజధాని తలలాంటిదని మా పిల్లలు చెబితే విన్నాను. ఆ రాజధాని నిర్మాణంలో తాను భాగం కావలని తలంచాను. ప్రస్తుతం సిఎం చంద్రబాబునాయుడు ఏకంగా రూ.4వేలు పెంచడమే కాకుండా గత మూడునెలలు కలిపి మొత్తంగా రూ.7వేలు. ఇచ్చారు. ఆ మొత్తాన్ని చూస్తేనే ఎందుకో నాకు రాజధాని గుర్తు వచ్చింది. అంతే నా చేతిలోకి పడిన డబ్బులను నా వంతు సాయంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతికి అందించా’ అని పట్టణంలోని శివానగన్‌కు చెందిన నారాయణమ్మ తెలిపింది. వృద్ధురాలు తన పింఛను మొత్తాన్ని రాజధాని కోసం విరాళంగా ఇవ్వటంతో అటు మంత్రి,ఇటు పరిటాలశ్రీరామ్‌, చిలకం మధులతోపాటు కూటమి నాయకులు అశ్చర్యపోయారు. నారాయణమ్మకు రాష్ట్ర రాజధాని అమరావతిపై ఉన్న మక్కువతో తన పింఛను విరాళంగా ఇవ్వడం తమకెంతో ఆనందాన్ని ఇస్తోందని వారు అన్నారు. ఆమె దాతృత్వానికి మనస్పూర్తిగా అభినందిస్తున్నామని వారు పేర్కొన్నారు.

➡️