ఘనంగా ‘పాంచజన్య’ వార్షికోత్సవం

Jun 17,2024 21:21

 కేక్‌ కట్‌ చేస్తున్న శ్రీనివాసులు

                   హిందూపురం : పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్స్‌ పాఠశాల 22వ వార్షికోత్సవ వేడుకలతో పాటు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు జన్మదిన వేడుకలను సోమవారం రాత్రి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు శ్రీనివాసులు కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి గంగప్ప, ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు వేణుగోపాల్‌, రీయాజ్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా పాఠశాలలో 10 సంవత్సరాలు విధులు నిర్వహించిన సిబ్బందికి సన్మానించి, నగదు బహుమతులు అందించారు. ఈ సందర్బంగా ఎంఇఒ గంగప్ప మాట్లాడుతు పట్టణంలో కొన్ని విద్యా సంస్థలు సంపాదనకోసమే స్థాపించారన్నారు. అయితే ఎటువంటి లాభపేక్ష లేకుండా సేవకోసమే శ్రీనివాసులు విద్యాలయాన్ని స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేస్తు పాఠశాలలో ఉన్నత మార్కులు సాధించిన వారికి ఉన్నత చదువులకు స్కాలర్‌ షిప్‌ అందించడం అభినందనీయం అన్నారు. అనంతరం పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతూ 21 సంవత్సరాల క్రితం ఒక ఆశయంతో పాఠశాలను స్థాపించడం జరిగిందన్నారు. నాటినుంచి నేటి వరకు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో పాటు సామాజిక సేవలో సైతం వారిని భాగ్యస్వాములు చేసి సమాజాభివృద్ధికి సైతం ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాలలో ఎక్కడాలేని విధంగా విద్యార్థులు కోసం యోగా, వ్యాయామ, గేమ్స్‌, స్పోర్ట్స్‌ లో సైతం తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాలకు అనుసందానంగా ట్రస్టును ఏర్పాటు చేసి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యకు తమ వంతు సహాకారం అందిస్తున్నామన్నారు. పాఠశాల వార్షికోత్సవం, పాఠశాల అధ్యక్షులు శ్రీనివాసులు ఒకే రోజు కావడంతో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా వేడుకలు జరిగేవని అయితే బక్రీద్‌ పండుగ రావడంతో పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యుల నడుమ కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు సందీప్‌, సెక్రటరీ నందకుమార్‌, స్కూల్‌ డైరెక్టర్లు భారతి శ్రీనివాస్‌, సత్య, అడ్మినిస్ట్రేటీవ్‌ డైరెక్టర్‌ స్మితకృష్ణ, అకాడమిక్‌ డైరెక్టర్‌ నందిత సందీప్‌, ఎఒ భాస్కర్‌, హెచ్‌ఎం గాయిత్రి, సుపరింటెండెంట్‌ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, అబ్దుల్‌ రజాక్‌, సతీష్‌ కుమార్‌, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️