ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసిపిలో పలువురు చేరిక

Apr 13,2024 22:12

పార్టీలోకి చేరిన వారితో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

                           ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11, 30వవార్డుల నుంచి 105 టీడీపీ కుటుంబాలు వైసిపిలో చేరాయి. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి వైసిపిలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు వేస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం డబ్బులు ఇలా వేస్తే మరో శ్రీలంక అవుతుందని అన్నారని చెప్పారు. కాని ఈరోజు అంతకన్నా ఎక్కువ ఇస్తామని అంటున్నాడని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని చెప్పారు. జెండాలు కలపడం కాదని జనం గుండెల్లో నిలవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఏరోజు ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో 11వవార్డు కౌన్సిలర్‌ అత్తర్‌ జిలాల్బాష, 30వవార్డు కౌన్సిలర్‌ రమాదేవి, వైసిపి పట్టణాధ్యక్షష్ట్రలుకోటిరెడ్డి బాలిరెడ్డి, వైయస్సార్‌ విద్యార్థివిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అమర్నాథ్‌ రెడ్డి, కౌన్సిలర్లు గోరకాటి పురుషోత్తం రెడ్డి. నాయకులు బడన్నపల్లి కేశవరెడ్డి, కుండా మీనాక్షయ్య, తీర్థాల రమణ, కత్తి పెద్దన్న, చెలిమి పెద్దన్న, ఉడుముల రాము, టైముతక రమణ, స్టోర్‌ డీలర్ల సంఘం రాష్ట్ర నాయకులు పరంధామరెడ్డి, సభ్యులు వెంకటరమణ, అంకె నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

➡️