విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ

Jun 17,2024 21:22

విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

                  కదిరి టౌన్‌ : పట్టణంలోని విద్యుత్‌ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ చేతుల మీదుగా సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు అన్ని వర్గాల సంక్షేమాన్ని భవిష్యత్తు తరాల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ భైరవ ప్రసాద్‌, బ్లూమూన్‌ విద్యా సంస్థల అధినేత, బలిజ సంఘం నాయకులు మంచి శివశంకర్‌, బలిజ సంఘం అధ్యక్షులు రమేష్‌ బాబు, కందుకూరు నాగరాజు, చింత శ్రీనివాసులు, శ్రీనివాసులు, అన్నం జనార్దన్‌, పసుపులేటి సురేష్‌ కుమార్‌, చలపతి, అడ్వకేట్‌ శివ శంకర్‌, నాగేంద్ర ప్రసాద్‌, బైరిశెట్టి, సుంకర రవీంద్ర, మల్లెం మోహన్‌, వీరశంకర్‌, కటారు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️