అనంతపురం డిఐజి అమ్మిరెడ్డిపై బదిలీ వేటు

అమ్మిరెడ్డి

అనంతపురం క్రైం

అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం కొరాఠా ఝుళిపించింది. అధికార పార్టీకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆయన విధుల నుంచి రిలీవ్‌ కావాలని, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. గత కొంతకాలంగా డిఐజిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు తీసుకుంది.

➡️