జాతీయస్థాయిలో పాంచజన్య విద్యార్థికి ప్రథమ ర్యాంకు

Jan 27,2024 12:26 #Sri Satya Sai District
panchajanya-studentgot-national-level-first-rank

విద్యార్థికి యూకే నుంచి పిలుపు
పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు
ప్రజాశక్తి-హిందూపురం : ఉపాధ్యాయుల శ్రమ, విద్యార్థుల కఠోర దీక్ష, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాలకు మంచి గుర్తింపు లభించిందని పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు అన్నారు. ఇటీవల నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలియాన్స్ ఇండియా ( ఎన్ ఐ ఎస్ ఏ ) జాతీయస్థాయిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్ ఏ ఏ టి -2023 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాంచజన్య పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థి ముస్తఫా జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఈ విషయంపై శనివారం పట్టణం లోని ప్రెస్ క్లబ్ లో పాఠశాల యాజమాన్యం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, సెక్రటరీ నందకుమార్ లు మాట్లాడుతు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలియాన్స్ ఇండియా వారు జాతీయస్థాయిలో ఎన్ఏఏటి 2023 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో జాతీయస్థాయిలో లక్షలాదిమంది ఆయా తరగతుల వారిగా పోటీపడ్డారు. ఇందులో పాంచజన్య పాఠశాల తరఫున 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 250 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక ఆలోచన, తార్కిక తార్కికం, సమస్య
పరిష్కారం, బహుళ మేధస్సు అంశాలపై నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 25 మంది మంచి ర్యాంకులు సాధించారు. ఇందులో 4వ తరగతిలో జాతీయ స్థాయిలో ముస్తఫా మొదటి స్థానం సాధించగా 3వ తరగతి విద్యార్థిని రిధ ఫాతిమా రెండవ స్థానం సాధించింది అన్నారు. వీరితో పాటు జాతీయ స్థాయిలో నాల్గవ ర్యాంకు ముగ్గురు విద్యార్థులు, ఐదవ ర్యాంకు ముగ్గురు విద్యార్థులు, ఆరవ బ్యాంకు ఆరు మంది విద్యార్థులు, ఏడవ ర్యాంకు ముగ్గురు విద్యార్థులు, ఎనిమిదవ ర్యాంకు ఒక విద్యార్థి, తొమ్మిదవ ర్యాంకు నలుగురు విద్యార్థులు, పదవ ర్యాంకు ఒక విద్యార్థి,13వ ర్యాంకు ఒక విద్యార్థి, 21ఒక విద్యార్థి సాధించారు. జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థి ముస్తఫా యునైటెడ్ కింగ్డమ్ (యూ కె) నుంచి పిలుపు వచ్చిందన్నారు. త్వరలో విద్యార్థి యూకే లోని కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రథమ బహుమతిని అందుకోనున్నారు. జాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన రిధా ఫాతిమా తో పాటు మరిన్ని ర్యాంకులు సాధించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ లోనే నిసా (ఎన్ ఐ ఎస్ ఏ), అపుస్మ (ఏ పి పి యు ఎస్ ఎమ్ ఏ ) సంయుక్తంగా సంయుక్తంగా ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేస్తారన్నారు. పాఠశాలలో చదువుతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే తమ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. ఈ విజయాలకు ప్రధాన కారణం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత బిడ్డ లాగా చూస్తూ చదువుతో పాటు వారికి మనోధైర్యాన్ని నింపడంతోనే విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇదే సందర్భంగా జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు అభినందించారు. ఈ సమావేశంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్లు స్మిత, నందిత, హెచ్ఎం గాయత్రి, ఏఓ భాస్కర్, సూపరిటెండెంట్ విజయేంద్ర, ఏ హెచ్ ఎం లు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్ తో పాటు ప్రధమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన ముస్తఫా, రిదా ఫాతిమా లు పాల్గొన్నారు.

➡️