చేనేత సమస్యల పరిష్కారానికి కృషి : పరిటాల శ్రీరామ్‌

Jun 17,2024 21:23

చేనేత కార్మికుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

                  ధర్మవరం టౌన్‌ : చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలో చేనేత కుటుంబాలను పరామర్శించి అధికారంలోకి రాగానే వారికి అండగా ఉంటామని భరోసా కల్పించింది. నారా భువనేశ్వరి ఇచ్చిన హామీ మేరకు పరిటాలశ్రీరామ్‌ చేనేత కుటుంబాలను సోమవారం కలిసి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ ఐదేళ్లలో చేనేతలు తీవ్ర దుర్భిక్షపరిస్థితులను ఎదుర్కొన్నారన్నారు. వైసీపీప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని, దీనికి తోడు ముడిసరుకులు రెట్టింపు అయ్యాయని, నేసిన చీరలకు గిట్టుబాటు ధర కూడా రాలేదని చేనేతలు పరిటాల శ్రీరామ్‌కు వివరించారు. చేనేతల సమస్యలు విన్న అనంతరం పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేనేతల అన్ని విధాలా అదుకుంటారని భరోసా ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఉన్న పథకాలను పునరుద్దరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ప్యాన్స్‌ కన్వీనర్‌ ఎల్‌.నరేంద్రచౌదరి, టీడీపీ పట్టణఅధ్యక్షులు పరిశేసుధాకర్‌, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, అంబటిసనత్‌, ఊట్లనరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️