వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాటం

Jul 1,2024 22:05

బంగారు కృష్ణమూర్తిని సన్మానిస్తున్న నాయకులు

              కదిరి టౌన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామనివాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని బంగారు కృష్ణమూర్తి స్వగృహంలో రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు . ఈ కార్యవర్గ సమావేశంలో మొదట రాష్ట్ర అధ్యక్షులుగా బంగారు కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొర్లపల్లి మోహన ,రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా ఆనంద్‌ , ట్రెజరీగా శ్రావణమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేకల శివప్రసాద్‌ ని ఎన్నుకున్నారు. అదే విధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా మల్లెం అశోక్‌, ఉపాధ్యక్షులుగా ముద్దల చిన్న నరసింహులు , ముదిగుబ్బ మండల అధ్యక్షునిగా వీరనారప్పను ఎన్నుకొన్నారు. బంగారు కృష్ణమూర్తి నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. బంగారు కృష్ణమూర్తి పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను ఈసందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

➡️