వ్యాక్సినేషన్‌తో టిబి దూరం : డిఎంహెచ్‌ఒ

May 23,2024 20:54

వ్యాక్సినేషన్‌పై సూచనలు చేస్తున్న అధికారులు

                       పుట్టపర్తి రూరల్‌ : 60 సంవత్సరాల పైబడిన వారికి అడల్ట్‌ బిసిజి వ్యాక్సినేషన్‌తో వందశాతం క్షయ వ్యాధిని అరికట్టవచ్చుననిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మంజు వాణి పేర్కొన్నారు. ఆమె గురువారం పుట్టపర్తి మండల పరిధిలోని వెంగళమ్మ చెరువు, కంబాలపర్తి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో రికార్డులను, వ్యాక్సిన్‌ గది, కాన్పుల గది, వార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలలో నిర్వహిస్తున్న ఆడాల్ట్‌ బిసిజి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్‌ వేయకూడదన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో టీబీ వచ్చి తగ్గిపోయిన వారికి, 60 సంవత్సరాలు నిండినవాళ్లు, పొగ తాగే వారు, షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు, బిఎంఐ శరీర ద్రవ్యరాశి సూచిక లేక ఎత్తుకు తగిన బరువు కన్నా తక్కువ ఉన్నవారు, టీబీ రోగులతో సన్నిహిత సంబంధం కలిగిన వారు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఒ నాగరాజు నాయక్‌, డిఎఎల్‌టి తిప్పయ్య, వెంగళమ్మ చెరువు, కంబాలపర్తి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️