ముఖ్యమంత్రిని ప్యాలెస్‌కు పరిమితం చేస్తాం

సమావేశంలో మాట్లాడుతున్న కూటమి నాయకులు

         హిందూపురం : 2019 ఎన్నికల సందర్బంగా నవరత్నల పేరుతో దాదాపు 730 హామిలను ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం చేస్తాం అని కూటమి నాయకులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాలయ్య నివాసం వద్ద టిడిపి కార్యాలయంలో కూటమి నాయకులు జగన్‌పై రూపొందించిన ఛార్జ్‌ షీట్‌ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం టిడిపి జిల్లా అధ్యక్షులు వడ్డే అంజినప్ప, బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ ఆదర్శ్‌ కుమార్‌, జనసేన నాయకులు భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచక పాలన అంతం చేయడమే కూటమి పంతం అన్నారు. గత 5 సంవత్సరాల జగన్‌ పాలనలో అన్ని వర్గాలను అణగదొక్కారన్నారు. గొడ్డలి వేటు, కొడీ కత్తి పోయ ఇప్పుడు గులకరాయి నాటకాలను ఆడుతున్న కపటనాటక సూత్రధారి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, ఐటీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు రామాంజనేయులు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్‌, అమీన్‌, బాబా ఫక్రుద్దీన్‌తో పాల్గొన్నారు.

➡️