పచ్చని చెట్లను కూడా వదలని వైసీపీ

Mar 6,2024 11:57 #Sri Satya Sai District
YCP does not spare even the green trees
  • అడ్డుకున్న తెదేపా సర్పంచ్ మంజు పై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం 
  • పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసు వేస్తా
  • మంత్రి ఉషశ్రీ చరణ్ గారు కార్యకర్తలను నాయకులు రెచ్చగొట్టడం మానుకో
  • తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జోలికొస్తే ఖబడ్దార్

ప్రజాశక్తి-రొద్దం : సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం బీదనపల్లి గ్రామంలో గ్రామ కంఠం ఆధ్వర్యంలో ఉన్న చింత చెట్టును వైసీపీ నాయకులు రూల్స్ ధిక్కరించి ఫారెస్ట్ అధికారులతో అనుమతులు పొంది చెట్టును కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అడ్డుకోబోతున్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంజు పై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడి చికిత్స పొందడం కోసం ఆసుపత్రికి వెళుతుండగా మళ్లీ దాడి చేశారు. అనంతరం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా  అక్కడికి వెళ్లి సర్పంచ్ మంజూ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో సవితమ్మ మాట్లాడుతూ రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆఖరికి పచ్చని చెట్లను కూడా నరికి వేస్తున్నారని బీధానపల్లిలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న చింత చెట్టును కొట్టివేస్తుండగా అడ్డుకున్న సర్పంచ్ మంజూపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ తెలిపారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తానని మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టడం మానుకోవాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️