వైసిపి ఎన్నికల ప్రచారం

Apr 17,2024 22:07

ప్రచారంలో పాల్గొన్ననాయకులు

                    పరిగి :రాష్ట్రంలో సంక్షేమ పాలన కావాలంటే మరోసారి జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం పరిగి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వైసిపిలో చేరారు. అనంతరం ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, సర్పంచి లక్ష్మీదేవి శివశంకర్‌, ఎంపిటిసి లింగమ్మ చంద్రశేఖర్‌ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు, ప్రభాకర్‌, రమణ, సింగారెడ్డి, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ :రానున్న ఎన్నికలలో వైసిపికి ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి మక్బూల్‌, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్‌ ప్రజలను కోరారు. ఈ మేరకు వారు బుధవారం కదిరి పట్టణం 29వ వార్డ్‌ కౌన్సిలర్‌ షబ్బీర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బైసిపిబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ , ఇస్మాయిల్‌ ,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నజిమున్నిసాసాదిక్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌ రెడ్డి, శంకర, జిల్లా అధికార ప్రతినిధి వేముల ఫయాజ్‌, వైసిపి పట్టణ అధ్యక్షులు జిలాన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

➡️